
డేవిడ్ విల్లీ స్థానంలో కీలక ప్లేయర్ ని తీసుకున్న ఆర్సీబీ
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ స్టార్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లీ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
ఈ నేపథ్యంలో అతడి స్థానంలో టీమిండియా బ్యాటర్ కేదార్ జాదవ్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది.
గాయంతో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జట్టుకు దూరం కావడంతో రూ.1 కోటి కనీస ధరతో కేదార్ జాదవ్ తో ఆర్సీబీ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రస్తుతం ఈ సీజన్ లో ఆర్సీబీ 7 మ్యాచ్ ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఐపీఎల్లో విల్లీ 4 మ్యాచ్ లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు.
Details
ఐపీఎల్ లో 93 మ్యాచ్ లు ఆడిన జాదవ్
ఈ ఏడాది వేలం పాటలో జాదవ్ తీసుకోవడానికి ఏ ఫ్రాంచేజీ ఆసక్తి చూపలేదు. మొన్నటిదాకా జియో సినిమాలో ఐపీఎల్ మరాఠీకి వ్యాఖ్యతగా జాదవ్ వ్యవహరించారు. కేదార్ యాదవ్ 2010లో ఐపీఎల్ లో అరంగ్రేటం చేశాడు.
ఇప్పటివరకూ 93 మ్యాచ్ ల్లో 1196 పరుగులు సాధించాడు. గతంలో కూడా ఆర్సీబీ తరుపున జాదవ్ 17 మ్యాచ్ లు ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 73 వన్డేలు ఆడి 1389 పరుగులు చేశాడు. అదే విధంగా బౌలింగ్ లో 27 వికెట్లను తీశాడు.
ఇక 9టీ20 మ్యాచ్ ల్లో 58 పరుగులు చేశాడు.