IPL 2025 RCB: ముగ్గురు స్టార్లను పక్కన పెట్టిన ఆర్సీబీ.. రిటెన్షన్ లిస్ట్ ఇదే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం తన రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, RCB ఇద్దరు స్టార్ క్రికెటర్లను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇంకా బీసీసీఐ రిటెన్షన్ నిబంధనలపై నిర్ణయం తీసుకోలేదు, కానీ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ ఆప్షన్ కలిపి ఆరు మంది ఆటగాళ్లను ప్రాంచైజీలు తమ వద్ద ఉంచుకోవచ్చని సమాచారం.
యువ కెప్టెన్ కోసం వేట..
RCB రిటెన్షన్ జాబితాలో విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, రజత్ పటీదార్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను మాత్రం ఈ సారి రిటైన్ చేయకపోవచ్చని భావిస్తున్నారు. 2024 ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపకపోవడం, అతడి వయస్సు 40 ఏళ్లకు చేరుకోవడంతో, RCB మరొక యువ కెప్టెన్ కోసం చూస్తున్నట్లు సమాచారం. ఇక గత సీజన్‌లో విఫలమైన గ్లెన్ మాక్స్‌వెల్‌పై RCB వేటు వేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ, కామెరూన్ గ్రీన్ కూడా ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఈ కారణంగా, ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లను RCB జట్టు నుండి తప్పించినట్లు సమాచారం.
IPL 2025 మెగా వేలం దుబాయ్‌లో నిర్వహించే అవకాశం
అనధికారిక వార్తల ప్రకారం, నవంబర్ రెండో వారంలో IPL 2025 మెగా వేలం దుబాయ్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నై, దిల్లీ, కోల్‌కతా కూడా తమ రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, శివమ్ దూబె, మతీశా పతిరణ, ఎంఎస్ ధోనీ దిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్, ట్రిస్టన్ స్టబ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్, ఫిల్ సాల్ట్