LOADING...
RCB vs GT: గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న ఆర్సీబీ

RCB vs GT: గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న ఆర్సీబీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 27, 2026
12:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఆ జట్టు ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ అద్భుత ప్రదర్శన చేసి విశ్వరూపం చూపించాడు. బెంగళూరు బ్యాటింగ్‌లో రజత్‌ పాటీదార్‌ 93 పరుగులు (నాటౌట్‌, 33 బంతుల్లో, 5 ఫోర్లు, 9 సిక్స్‌లు)తో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

వివరాలు

టాప్ స్కోరర్ గా నిలిచిన రాహుల్ తెవాటియా

విరాట్‌ కోహ్లీ 43 పరుగులు (25 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్య 43 పరుగులు (28 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రాణించారు. వెంకటేశ్‌ అయ్యర్‌ 19 పరుగులు చేయగా, టిమ్‌ డేవిడ్‌ 4 పరుగులకే పరిమితమయ్యాడు. జితేశ్‌ శర్మ 15*పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌లో కగిసో రబాడా, జాసన్‌ హోల్డర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక వికెట్‌ సాధించాడు. అనంతరం 255 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రాహుల్‌ తెవాతియా 68 పరుగులు (43 బంతుల్లో, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

వివరాలు

విఫలమైన గుజరాత్ బౌలర్లు

జోస్‌ బట్లర్‌ 29 పరుగులు చేశాడు. అయితే సాయి సుదర్శన్‌ 14 పరుగులు, శుభ్‌మన్‌ గిల్‌ 2 పరుగులు, నిశాంత్‌ సింధు 5 పరుగులు, వాషింగ్టన్‌ సుందర్‌ 8 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలింగ్‌లో జాకబ్‌ డఫీ 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. భువనేశ్వర్‌ కుమార్‌, రసిఖ్‌ సలామ్‌ దార్‌, కృనాల్‌ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టగా, జోష్‌ హేజిల్‌వుడ్ ఒక వికెట్‌ సాధించాడు.

Advertisement