LOADING...
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కోహ్లీ సరికొత్త రికార్డు
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కోహ్లీ సరికొత్త రికార్డు

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కోహ్లీ సరికొత్త రికార్డు

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
10:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సాధించాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 278 మ్యాచ్‌లతో సమంగా ఉన్న ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను అధిగమిస్తూ కోహ్లీ 279 మ్యాచ్‌లతో అగ్రస్థానానికి చేరాడు. 2008 నుంచి ఇప్పటివరకు 19 సీజన్లుగా ఒకే జట్టు ఆర్సీబీ తరఫున ఆడుతున్న ఏకైక ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.

వివరాలు

ఒకే జట్టుపై ఆడుతున్న ఏకైక ఆటగాడు..

ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 78 పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 426 టీ20 మ్యాచ్‌ల్లో 13,922 పరుగులు చేశాడు. మరోవైపు కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్ కూడా ఈ మ్యాచ్‌తో ఒకే జట్టు తరఫున తన 199వ మ్యాచ్ ఆడుతూ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకే ఫ్రాంచైజీకి దీర్ఘకాలంగా సేవలందిస్తూ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీ అభిమానులు ఈ రికార్డు ఫీట్‌ను సోషల్ మీడియాలో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Advertisement