RCB: నేడే ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా జట్లు తమ కొత్త జెర్సీలను లాంచ్ చేశాయి.
ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. అయితే ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ ప్రత్యేకంగా అన్‌బాక్స్ ఈవెంట్ నిర్వహించనుంది.
ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు.
మరి ఈ అన్‌బాక్స్ ఈవెంట్‌ను లైవ్‌గా చూడాలంటే ఎలా? ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Details
ఎక్కడ, ఎప్పుడంటే?
ఈ అన్‌బాక్స్ ఈవెంట్ మార్చి 17న (సోమవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే ఈ ఈవెంట్ ఐపీఎల్ 2025 సీజన్ ముందు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలు
ఈ అన్‌బాక్స్ ఈవెంట్‌లో క్రికెట్ అభిమానులను అలరించే పలు ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
సిక్స్-హిటింగ్ ఛాలెంజ్
ఇందులో ఆటగాళ్లు భారీ సిక్సర్లతో తమ సత్తా చాటనున్నారు.
లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్క
న్నడ సింగర్స్ సంజిత్ హెగ్డే, ఐశ్వర్య రంగరాజన్, రాపర్ ఆల్ ఓకే, హనుమాన్ కింద్ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.
Details
లైవ్ చూడాలంటే?
ఈ అన్‌బాక్స్ ఈవెంట్‌ను ఆర్సీబీ యాప్ లేదా వెబ్‌సైట్ద్వా రా లైవ్‌లో వీక్షించవచ్చు.
అయితే లైవ్ స్ట్రీమింగ్ కోసం రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, రొమారియో షెపర్డ్, నువాన్ తుసార, లుంగి ఎన్‌గిడి, జితేష్ శర్మ, యశ్ దయాల్, రసిఖ్ ధర్, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్ పాల్గొననున్నారు.
ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా అన్‌బాక్స్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది.