
IPL 2025: వివాదానికి తెరలేపిన ఆర్సీబీ.. వైరల్ అవుతున్న వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త వివాదానికి తెరతీసింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై ఎగతాళి చేస్తున్నట్లుగా ఉన్న ఆర్సీబీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతేడాది గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌కు మారాడు. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించారు.
అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. హార్దిక్, రోహిత్ మధ్య విభేదాలు తలెత్తాయని, దీనివల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని వార్తలు వచ్చాయి.
పైగా, అభిమానుల నుంచి హార్దిక్ పాండ్య తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.
వివరాలు
పటీదార్‌ను అభినందించిన డుప్లెసిస్, విరాట్ కోహ్లీ
ఇదిలా ఉండగా,ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఆర్సీబీ తమ కెప్టెన్‌ను మార్చింది.
ఫాఫ్ డుప్లెసిస్‌ను తప్పించి,రజత్ పటీదార్‌ను కొత్త సారథిగా ప్రకటించింది.
ఈ సందర్భంగా పటీదార్‌ను అభినందిస్తూ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ వీడియో సందేశాలు పంపారు.
అయితే, ఇదే సందర్భాన్ని ఉపయోగించుకుని ఆర్సీబీకి చెందిన 'మిస్టర్ నాగ్స్' ముంబై ఇండియన్స్‌ను ట్రోల్ చేశాడు.
పటీదార్‌తో మిస్టర్ నాగ్స్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అందులో మిస్టర్ నాగ్స్... "పటీదార్, మొత్తానికి నువ్వు కెప్టెన్ అయ్యావు. ఆర్సీబీ మాజీ సారథులు దీని కోసం అనుమతి ఇచ్చారు. విరాట్, డుప్లెసిస్ నీకు అభినందనలు తెలిపారు. అన్ని టీమ్‌లు కెప్టెన్సీ మార్పు చేసినప్పుడు ఇదే విధంగా చేశాయనుకుంటున్నావా?" అని ప్రశ్నించాడు.
వివరాలు
'MI nahi janta' అనే కదా?"
దీనికి పటీదార్ వివాదాలకు ఆస్కారం లేకుండా "నన్ను మన్నించండి. నాకా విషయాల గురించి ఏమీలేదు" అని సమాధానం ఇచ్చాడు.
అయితే, మిస్టర్ నాగ్స్ తను ఊహించిన సమాధానం రాకపోవడంతో "రజత్, నిజంగా నీకు తెలియదా? అయితే ఎందుకు నవ్వుతున్నావు?.. అంటే నీ ఉద్దేశం 'MI nahi janta' అనే కదా?" (ముంబై ఇండియన్స్‌కు తెలియదు అనే అర్థంలో) అని వ్యంగ్యంగా అన్నాడు.
ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ అంశంపై అనేక మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Mr. Nags absolutely owned the 'Selfless Captain' and MI in his recent video with Rajat Patidar 😭☠️🔥 pic.twitter.com/AdFWMcPkct
— Ayush (@itsayushyar) March 21, 2025