RCB vs SRH: ప్లేయింగ్ 11 చూసి షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్ హెచ్.. హై వోల్టేజ్ పోరు!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ రేపటి నుంచి ఆరంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లోనే మాజీ ఛాంపియన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. దీంతో లీగ్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. గత సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్సీబీ, ఈసారి కూడా అదే దూకుడును కొనసాగించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతోంది. ఓపెనింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడీ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద బలం.
వివరాలు
ఆర్సీబీ వ్యూహాలు ఫలిస్తాయా?
మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ ఉండగా, ఫినిషర్లుగా జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ జట్టుకు అదనపు బలాన్ని అందిస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్ కీలక పాత్ర పోషించనున్నారు.
అయితే హేజిల్ వుడ్ గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమవడం జట్టుకు కొంత ప్రతికూలంగా మారింది.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
కానీ పాట్ కమిన్స్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
కమిన్స్ గైర్హాజరీ ప్రభావం?
బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మరోసారి విధ్వంసం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ జట్టుకు కీలక ఆధారంగా నిలుస్తారు.
బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, యువ స్పిన్నర్ హర్ష్ దుబే తమ ప్రతిభను చూపించాల్సి ఉంటుంది.
రెండు జట్లు కాగితంపై బలంగా కనిపిస్తున్నప్పటికీ, ఆర్సీబీకి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి సమతుల్యత ఉంది.
ఎస్ఆర్ హెచ్ మాత్రం ప్రధానంగా తన బ్యాటింగ్ శక్తిపైనే ఆధారపడుతోంది.
ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కానీ కమిన్స్ లేకపోవడం ఒక విధంగా జట్టుకు మైనసే అవుతుంది.
వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంభావ్య ప్లేయింగ్ XI:
ఫిల్ సాల్ట్
విరాట్ కోహ్లీ
దేవదత్ పడిక్కల్
రజత్ పాటిదార్ (కెప్టెన్)
జితేష్ శర్మ (వికెట్ కీపర్)
టిమ్ డేవిడ్
రొమారియో షెపర్డ్
క్రునాల్ పాండ్యా
భువనేశ్వర్ కుమార్
జాకబ్ డఫీ
మంగేష్ యాదవ్
వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ సంభావ్య ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ,
ట్రావిస్ హెడ్,
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, కెప్టెన్)
నితీష్ కుమార్ రెడ్డి,
హెన్రిచ్ క్లాసెన్
అనికేత్ వర్మ
హర్షల్ పటేల్
లియామ్ లివింగ్‌స్టోన్
జీషన్ అన్సారీ
ఇషాన్ మలింగా
జయదేవ్ ఉనద్కత్