
IPL 2023: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో రాజస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు.
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 182 పరుగులే చేశారు. దీంతో బెంగళూర్ ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.
ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ 39 బంతుల్లో 62 పరుగులు, మాక్స్ వెల్ 44 బంతుల్లో 77 పరుగులతో చెలరేగారు.
రాజస్థాన్ బ్యాటర్లలో జశస్వీ జైస్వాల్ 47, దేవదుత్ ఫడిక్కల్ 52 పరుగులతో రాణించారు.
Details
తడబడ్డ రాజస్థాన్ బ్యాటర్లు
లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు రాజస్థాన్ తొలి ఓవర్ లోనే జోస్ బట్లర్(0) వికెట్ కోల్పోయింది.
ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్, దేవదుత్ ఫడిక్కల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.
వీరిద్దరూ రెండో వికెట్ కు 98 పరుగులు జోడించారు. చివర్లో సంజుశాంసన్(22), జురెల్(34) పరుగులతో ఫర్వాలేదనిపించారు.
రాజస్థాన్ వెంట వెంటనే వికెట్లు కోల్పోడంతో చివరికి పరాజయం పాలైంది. చివరి ఓవర్ లో 20 పరుగులు అవసరం కాగా.. కేవలం 12 పరుగులు వచ్చాయి.
బెంగళూరు బౌలర్లలో హర్షద్ పటేల్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్, డేవిడ్ విల్లీ తలో ఓ వికెట్ తీశారు.