Page Loader
APL 2025 Auction: ఏపీఎల్‌ వేలంలో హనుమ విహారి, నితీష్‌ రెడ్డికి రికార్డు ధర.. ఎంతంటే?
ఏపీఎల్‌ వేలంలో హనుమ విహారి, నితీష్‌ రెడ్డికి రికార్డు ధర.. ఎంతంటే?

APL 2025 Auction: ఏపీఎల్‌ వేలంలో హనుమ విహారి, నితీష్‌ రెడ్డికి రికార్డు ధర.. ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) 2025 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం విశాఖపట్టణంలో ఘనంగా జరిగింది. సోమవారం రాడిసన్‌ బ్లూ హోటల్‌ వేదికగా నిర్వహించిన ఈ వేలంలో ఏపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు, ఏసీఏ ఉపాధ్యక్షుడు పివీఆర్‌ ప్రశాంత్, గ్రౌండ్‌ డెవలప్‌మెంట్‌ జీఎం ఎంఎస్‌ కుమార్, కౌన్సిలర్‌ దంతు విష్ణు తేజ్‌తో పాటు ఏడు జట్ల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. ఈ వేలంలో విశాఖకు చెందిన క్రికెటర్ పైలా అవినాష్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ ఫ్రాంచైజీ అతడిని రూ.11.05 లక్షలకు కొనుగోలు చేసింది. అదే జట్టు గిరినాథ్‌ రెడ్డిని రూ.10.05 లక్షలకు దక్కించుకుంది.

Details

తన

మరోవైపు సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌ జట్టు రిక్కీ భుయ్‌ను రూ.10.26 లక్షలకు కైవసం చేసుకుంది. భారత క్రికెటర్లు కూడా ఈ వేలంలో ఆకర్షణగా నిలిచారు. టీమిండియా యువ క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డిని భీమవరం బుల్స్‌ జట్టు రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. భారత టెస్ట్ ఆటగాడు హనుమ విహారిని అమరావతి రాయల్స్‌ జట్టు అదే ధరకే కొనుగోలు చేయగా, టీమిండియా వికెట్ కీపర్ కెఎస్‌ భరత్‌ను కాకినాడ కింగ్స్‌ రూ.10 లక్షలకు ఎంపిక చేసింది. రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు షేక్‌ రషీద్‌ను కూడా రూ.10 లక్షలకే సంతకం చేసింది.

Details

ఆగస్టు 8న ప్రారంభం

ఇదిలా ఉండగా, గతంలో ఫ్రాంఛైజీలకు ఉన్న రూ.75 లక్షల పర్స్ వాల్యూ ఈ సీజన్‌లో గణనీయంగా పెరిగింది. ఏసీఏ పర్సును రూ.2 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీఎల్‌ సీజన్‌ 4 ఈ ఏడాది ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. మ్యాచ్‌లు పూర్తిగా విశాఖపట్నం వేదికగానే జరగనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 25 మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో 21 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉండనున్నాయి.