IND vs NZ 4th T20: మ్యాచ్‌కు ముందు రిలాక్స్ మోడ్.. వైజాగ్‌లో సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విశాఖపట్నంలో భారత జట్టు ఆటగాళ్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న వైజాగ్‌కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రస్తుతం మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. బుధవారం (జనవరి 28) ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న కీలక నాలుగో టీ20కు ముందు టీమిండియా ఆటగాళ్లు అభిమానులకు ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. వైజాగ్‌లోని వరుణ్ ఇనాక్స్ థియేటర్‌లో టీమిండియా క్రికెటర్లు క్లాసిక్ దేశభక్తి చిత్రం 'బార్డర్'ను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత ఆటగాళ్లను థియేటర్‌లో చూసిన అభిమానులు ఉత్సాహానికి లోనయ్యారు.
Details
యాజమాన్యం కోసం ప్రత్యేకంగా మూవీ షో
టీమిండియా కోసం వరుణ్ ఇనాక్స్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ మూవీ షోను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ స్పెషల్ షోకు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ ప్లేయర్లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యారు. థియేటర్‌లో సరదాగా సినిమా చూస్తూ రిలాక్స్ అవుతున్న భారత ఆటగాళ్లు అభిమానుల దృష్టిని ఆకర్షించారు. మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్ల ఈ మోమెంట్స్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.