Mohammed Shami: మహ్మద్ షమీకి విశ్రాంతి.. న్యూజిలాండ్ మ్యాచులో అర్షదీప్‌కి ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో షమీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా షమీ పిక్క కండరాలు పట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని రెస్ట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో షమీ స్థానంలో అర్షదీప్‌ను ఆడించే అవకాశాలున్నాయి.
బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ సమక్షంలో అర్షదీప్ శుక్రవారం ప్రాక్టీస్ చేయగా, ఈ సెషన్‌లో అతను 13 ఓవర్లు బౌల్ చేశాడు.
Details
టీమిండియా బౌలింగ్ లో మార్పులు
మరోవైపు, షమీ మాత్రం కేవలం 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు మాత్రమే వేసిన తర్వాత షమీ ఫిజియో చికిత్స తీసుకున్నాడు. అతి కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు షమీకి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఈ నిర్ణయంతో బౌలింగ్ లైనప్‌లో స్వల్ప మార్పులు ఉండవచ్చని అసిస్టెంట్ కోచ్ రియాన్ డోస్చే తెలిపారు.