WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ..
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) - 2025 టోర్నమెంట్ గ్రాండ్‌గా ఆరంభమైంది.
తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) జట్ల మధ్య జరిగింది.
ఈ మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. అయితే చివరకు విజయాన్ని బెంగళూరు జట్టు అందుకుంది.
డబ్ల్యూపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించింది.
రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చింది. కేవలం 27 బంతుల్లోనే ఏడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
వివరాలు
ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బలు
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
బెత్ మూనీ (56), ఆష్లే గార్డ్‌నర్ (79 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో గుజరాత్ ఈ స్కోర్ సాధించగలిగింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.
14 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు - స్మృతి మంధాన, డానీ వ్యాట్ - గార్డ్‌నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.
దీంతో ఆర్సీబీ ఓటమి అంచున ఉన్నట్లు కనిపించినా, ఎలీస్ పెర్రీ (57) సమయోచిత ఇన్నింగ్స్ ఆడి, రిచా ఘోష్ తోడుగా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడటంతో, ఆర్సీబీ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.
వివరాలు
ఇంతకుముందు ముంబై ఇండియన్స్ పేరిట రికార్డు
ఈ విజయంతో ఆర్సీబీ మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది.
డబ్ల్యూపీఎల్‌లో 200కుపైగా పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేజిక్కించుకున్న మొదటి జట్టుగా కూడా రికార్డు సాధించింది.
ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది.
2024లో గుజరాత్ జెయింట్స్ పై 191 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఛేదించిన సంగతి తెలిసిందే.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ విజయాల్లో నలుగురు గుజరాత్ జట్టుపైనే నమోదవడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
RCB - THE DEFENDING CHAMPIONS.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025
- What a blockbuster start to WPL 2025. 🌟pic.twitter.com/sWoG06Hz10