Page Loader
షూటింగ్ ప్రపంచక‌ప్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన భారత షూటర్ నిశ్చ‌ల్
సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన భారత షూటర్ నిశ్చ‌ల్

షూటింగ్ ప్రపంచక‌ప్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన భారత షూటర్ నిశ్చ‌ల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ నగరం రియో ​​డి జనీరోలో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత షూటర్ రికార్డు సృష్టించింది. మ‌హిళ‌ల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిష‌న్స్ ఈవెంట్‌లో 19 ఏళ్ల భారత యువ షూట‌ర్ నిశ్చ‌ల్‌ సిల్వర్ మెడల్ సాధించింది. నార్వే షూట‌ర్ జానెట్ హెగ్ డుసాడ్ తొలి స్థానంలో నిలవగా, ఫైన‌ల్లో నిశ్చ‌ల్ 458 పాయింట్లు స్కోర్ చేసింది. తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ లోనే సిల్వర్ మెడ‌ల్(రజత పతకం) ద‌క్క‌ించుకోవడం పట్ల నిశ్చ‌ల్ సంతోషం వ్యక్తం చేశారు. ఉద‌యం 2సార్లు ఎలిమినేష‌న్ రౌండ్లు జ‌రగగా, 18 మంది షూట‌ర్లు ఎలిమినేటయ్యారు. ఈ మేరకు రిలే రౌండ్‌లో నిశ్చ‌ల్ 587 స్కోర్ చేయగా, క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో 592 పాయింట్లు సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షూటింగ్ ప్రపంచక‌ప్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన భారత షూటర్ నిశ్చ‌ల్