LOADING...
Rinku Singh: రింకూ సింగ్‌ను టార్గెట్ చేసిన అండర్ వరల్డ్.. 5 కోట్ల డిమాండ్ చేసిన దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ 
5 కోట్ల డిమాండ్ చేసిన దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ

Rinku Singh: రింకూ సింగ్‌ను టార్గెట్ చేసిన అండర్ వరల్డ్.. 5 కోట్ల డిమాండ్ చేసిన దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కొత్త ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నరింకూ సింగ్‌కు అండర్‌ వరల్డ్ నుండి బెదిరింపుల సమస్య ఎదురైంది. రూ.5 కోట్లు ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌ కథనం వెల్లడించింది. ఈ వార్త ఆంగ్ల మీడియా వర్గాల్లో ప్రచారంలోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో రింకూ సింగ్‌కు మూడు విడతల బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారు అత‌డిని రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రింకూ సింగ్ పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా, ఈ కేసుకు సంబంధించి మొహమ్మద్‌ దిల్షద్‌, మొహమ్మద్‌ నవీద్ అనే ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ ఇద్దరూ రింకూ సింగ్‌ను బెదిరించిన విషయాన్ని ఒప్పుకున్నారు.

వివరాలు 

2024లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం 

వీరు కరేబియన్ దీవుల్లో (వెస్టిండీస్) నివసిస్తుండగా, ఆగస్ట్ 1న ముంబై క్రైమ్ బ్రాంచ్ వారిని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం,వీరు గతంలో ముంబైలో హత్యకు గురైన ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీ వద్దనుంచి కూడా రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్. అతను ఐపీఎల్ 2023 ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌రుపున ఆఖ‌రి ఓవ‌ర్‌లో చివ‌రి ఐదు బంతుల‌కు ఐదు సిక్స‌ర్లు కొట్టి త‌న జ‌ట్టుకు న‌మ్మ‌శ‌క్యంగాని విజ‌యాన్ని అందించాడు ఈ ప్రదర్శన తర్వాత రింకూ 2024లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన అరంగ్రేటం చేశారు.

వివరాలు 

స్ట్రైక్ రేట్ 161.8

ఇప్పటివరకు రింకూ సింగ్ భారత్ తరపున 34 టీ20 మ్యాచ్‌లలో పాల్గొని, సగటుగా 42.31 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 161.8 ఉండగా, మొత్తం 550 పరుగులు చేశాడు. ఇటీవలి ఆసియాకప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో రింకూ సింగ్ ఫోర్ కొట్టి భార‌త్ తొమ్మిదో సారి క‌ప్పును కైవ‌సం చేసుకోవ‌డంలో సాయ‌ప‌డ్డాడు.