రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ నుంచి తన స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో కారును అదుపు చేయలేక ప్రమాదానికి గురైనట్లు పంత్ వెల్లడించారు.
వైద్యులు రిషబ్ పంత్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. మెడదు, వెన్నెముక ఇబ్బంది లేదని, అయితే ముఖానికి తగిన గాయాలకు వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేశారు
కారు ప్రమాదం నుండి బయటపడిన రిషబ్ పంత్, అతడి తలపై బలమైన గాయాలు, కుడి మోకాలిలో గాయం తీవ్రతను తగ్గించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.
రిషబ్ పంత్
పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ క్లారిటీ
మోకం నుదురు చిట్లిందని... వీపుపై మంటల కారణంగా కాలిన గాయాలు అయ్యాయని.. కుడి మోకాలి లిగ్మెంట్ డిస్ లొకేట్ అయినట్లు ఎక్స్‌రేల్లో తెలిసినట్లు పేర్కొంది. మడమ, బొటనవేలిపై కూడా గాయాలున్నాయి. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని బీసీసీఐ వెల్లడించారు.
ప్రస్తుతం భారత్ క్రికెట్ బోర్డు పంత్ కుటంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. వైద్య సిబ్బంది కూడా టచ్ లో ఉన్నామని, పంత్ సురక్షితంగా ప్రాణాల నుండి బయటపడడం సంతోషమని తెలిపింది.