LOADING...
Rishabh Pant: పంత్‌లో కొత్త మార్పు
పంత్‌లో కొత్త మార్పు

Rishabh Pant: పంత్‌లో కొత్త మార్పు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 16, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు గాయాల సమస్యలు, మరోవైపు అధిక బరువుతో ఇబ్బంది పడిన దూకుడు బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఐపీఎల్-19కి ముందు పూర్తిగా ఫిట్‌గా మారాడు. గత ఐదు నెలలుగా జిమ్‌లో కష్టపడి శ్రమించిన అతను గణనీయంగా బరువు తగ్గి, మునుపటికంటే మరింత సన్నగా కనిపిస్తున్నాడు. 2025 ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అనంతరం పంత్‌ని జట్టు కెప్టెన్‌గా నియమించింది. కేఎల్ రాహుల్ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన పంత్ జట్టును నడిపించినప్పటికీ, ప్లేఆఫ్స్ దాకా తీసుకెళ్లలేకపోయాడు.

వివరాలు

ఈసారి ఏం చేస్తాడో..

ఈ సీజన్‌కు లక్నో ఫ్రాంచైజీ అతడిని జట్టులో కొనసాగించింది. గత కొంతకాలంగా ఫామ్ లోపంతో ఉన్న కారణంగా, టీమ్ ఇండియా సెలక్టర్లు పంత్‌ను ఎంపిక చేయలేదు. ఇటీవల పంత్ మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను కలిసి కొన్ని సూచనలు, సలహాలు తీసుకున్నాడు. ఇప్పుడు బరువు తగ్గి మరింత ఫిట్‌గా కనిపిస్తున్న పంత్, ఈసారి ఐపీఎల్‌లో ఎలా ప్రదర్శన చేస్తాడన్నది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Advertisement