LOADING...
KKR vs RR : రియాన్ పరాగ్ పోరాటం వృథా.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం
రియాన్ పరాగ్ పోరాటం వృథా.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం

KKR vs RR : రియాన్ పరాగ్ పోరాటం వృథా.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2025
07:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. 207 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో రాజస్థాన్ ఆదిలోనే ఒడిదుడుకులకు లోనైంది. ఒక దశలో 71 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. అలాంటి సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ (95) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు నిలువెత్తు ధైర్యంగా నిలిచాడు. అతనికి హెట్‌మయర్ మంచి తోడుగా నిలిచాడు. కానీ ఇద్దరూ వరుసగా ఔట్ కావడంతో రాజస్థాన్ విజయానికి దూరమైంది.

Details

రాజస్థాన్ అభిమానుల్లో నిరాశ

మ్యాచ్ చివరి ఓవర్‌కి రాజస్థాన్‌కి ఇంకా 22 పరుగులు అవసరంగా ఉండగా, శుభమ్ దూకుడుగా ఆడి 6, 4, 6 బాదుతూ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. అయితే చివరి బంతికి 3 పరుగులు అవసరమైన దశలో కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడంతో మ్యాచ్‌ను కోల్పోయింది. కేవలం ఒక్క పరుగుతో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం