
Riyan Parag: ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రియాన్ పరాగ్.. బీసీసీఐ భారీ ఫైన్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ చివరకు తమ తొలి విజయాన్ని సాధించింది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చెందిన ఆ జట్టు, మూడో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది.
మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు మాత్రం ఎదురుదెబ్బ తగిలింది.
వివరాలు
భారీ జరిమానా.. కారణం ఇదే!
రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ భారీగా రూ.12 లక్షల ఫైన్ విధించింది.
గువహటిలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడటమే దీని కారణం.
నిర్ణీత సమయానికి 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో కెప్టెన్‌గా ఉన్న పరాగ్‌కు ఈ జరిమానా పడింది.
అయితే, ఇది జట్టు కోసం తొలి తప్పిదం కావడంతో జరిమానా పరిమితి రూ.12 లక్షలుగా నిర్ణయించారు.
వివరాలు
పాండ్యా తర్వాత పరాగ్
ఇటీవల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా జరిమానా ఎదుర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓవర్లు ఆలస్యంగా వేయడంతో పాండ్యాపై రూ.12లక్షల జరిమానా పడింది.
2024 సీజన్‌లో రెండుసార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా కెప్టెన్సీ బ్యాన్‌కు గురయ్యాడు.కానీ 2025 సీజన్‌లో ఈ నిబంధనను బీసీసీఐ తొలగించింది.
రియాన్ పరాగ్ అద్భుతమైన క్యాచ్!
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.శివం దూబే గట్టిగా కొట్టిన బంతిని ఒక్క చేత్తో డైవ్ చేస్తూ అందుకున్నాడు.
సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో 10వఓవర్ మూడో బంతికి ఈ కీలకమైన క్యాచ్ పట్టి దూబేను పెవిలియన్‌కు పంపించాడు. ఈ క్యాచ్‌ను పట్టిన అనంతరం పరాగ్ సంబరాలు చేసుకున్నాడు.
వివరాలు
మ్యాచ్ హైలైట్స్
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది.
నితీశ్ రాణా 36 బంతుల్లోనే 81 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పరాగ్ 28 బంతుల్లో 37 పరుగులు చేసి నిలకడగా ఆడాడు.
లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు ఆశలు నిలబెట్టాడు.
చివర్లో ఎంఎస్ ధోనీ 11 బంతుల్లో 16 పరుగులు చేసినా, చివరి ఓవర్లో ఔటయ్యాడు. రాజస్థాన్ బౌలర్ వణిందు హసరంగ 4 వికెట్లు తీసి బౌలింగ్‌లో రాణించాడు.
వివరాలు
పాయింట్ల పట్టికలో పరిస్థితి
ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ గెలిచిన చెన్నై, ఆ తర్వాత వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక మూడో మ్యాచ్‌లో విజయం సాధించిన రాజస్థాన్ తొమ్మిదో స్థానానికి చేరింది.
ఈరోజు పోరు - ముంబై vs కోల్‌కతా
ఈరోజు (మార్చి 31) ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.