LOADING...
Pakistan: పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా రిజ్వాన్ తొలగింపు.. కొత్త సారిథి ఎవరంటే? 
పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా రిజ్వాన్ తొలగింపు.. కొత్త సారిథి ఎవరంటే?

Pakistan: పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా రిజ్వాన్ తొలగింపు.. కొత్త సారిథి ఎవరంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వన్డే జట్టు కెప్టెన్సీ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్ పదవి తొలగించి, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని జట్టు పగ్గాలు అందించారు. ఈ మార్పు 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని బోర్డు తెలిపింది. రిజ్వాన్ స్థానంలో అఫ్రిది పాకిస్థాన్‌లో కెప్టెన్ల మార్పు కొనసాగుతున్న నేపథ్యంలో రిజ్వాన్ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారు. అతని స్థానంలో ఎడమచేతి వాట్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది కొత్త వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పీసీబీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Details

కెప్టెన్సీ బాధ్యతలు ప్రారంభం 

షాహీన్ అఫ్రిది నవంబర్ 4 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో కెప్టెన్‌గా తన కొత్త బాధ్యతలను ప్రారంభించనున్నాడు. ఈ సిరీస్ ఫైసలాబాద్‌లోని ఇక్బాల్ స్టేడియంలో ఆడుతుంది. నిర్ణయం వెనుక కారణాలు రిజ్వాన్ నాయకత్వంలో జట్టు తక్కువ విజయాలను సాధించడం ప్రధాన కారణంగా భావించారు. అతను కెప్టెన్సీలో 20 వన్డేలలో 9 విజయం, 11 ఓటములతో (విజయాల శాతం 45%) నిలిచాడు. ముఖ్యంగా 2024 ఛాంపియన్స్ ట్రోఫీ, న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లలో పరాజయాలు ఈ నిర్ణయానికి దారితీశాయి. షాహీన్ అఫ్రిది నియామకం ఇస్లామాబాద్‌లోని ఉన్నత స్థాయి సమావేశంలో ఖరారైంది.

Details

 రెండోసారి కెప్టెన్సీ

జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఇది అఫ్రిదికి రెండోసారి అవకాశం. గతంలో 2024 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టు 1-4తో ఓడింది. ఆ తరువాత బాబర్ ఆజమ్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఈ మార్పుతో పాకిస్థాన్ జట్టు మూడు వేర్వేరు ఫార్మాట్లకు మూడు వేర్వేరు కెప్టెన్లు కలిగినట్టయింది: టెస్టులకు షాన్ మసూద్, వన్డేలకు షాహీన్ షా అఫ్రిది, టీ20లకు సల్మాన్ అలీ ఆఘా నియమించారు. తరచూ కెప్టెన్సీ మార్పులు జరుగుతున్న పాకిస్థాన్ క్రికెట్‌లో, షాహీన్ అఫ్రిది నాయకత్వంలో జట్టు ఎలాంటి ప్రదర్శన చూపుతుందో వేచిచూడాల్సి ఉంది. ముఖ్యంగా 2027 ప్రపంచకప్‌కు ముందు జట్టును బలోపేతం చేయాల్సిన బాధ్యత 25 ఏళ్ల స్టార్ పేసర్‌పై ఉంది.