తదుపరి వార్తా కథనం
Rohit Sharma: రోహిత్ శర్మకు 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు ప్రదానం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 27, 2025
10:52 am
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో ప్రత్యేక గౌరవం అందుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతనికి 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు లభించింది. ఈ అవార్డును భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్‌కు అందజేశారు. ఈ సిరీస్‌లో రోహిత్ తన సొంత శైలిలో రాణించాడు. ఒక మ్యాచ్‌లో శతకం, మరో మ్యాచ్‌లో అర్ధశతకం బాదుతూ హిట్‌మ్యాన్ తన బ్యాటింగ్ ప్రతాపాన్ని మరోసారి చాటుకున్నాడు. మొత్తం సిరీస్ అంతటా రోహిత్ 202 పరుగులు సాధించి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు.