Rohit Sharma: మరోసారి విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా చెత్త రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు.
మెల్‌బోర్న్ లోని తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులకే ఔటైన రోహిత్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా నిరాశపరిచాడు.
9 పరుగులకే పెవిలియన్ చేరిన రోహిత్, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో కెప్టెన్‌గా రోహిత్ పేరిట చెత్త రికార్డు నమోదైంది. టెస్ట్ క్రికెట్‌లో ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటవడం ఇది ఆరోసారి.
ఈ ప్రదర్శనతో టెస్టుల్లో ఒక కెప్టెన్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేతిలో ఎక్కువ సార్లు ఔటైన ప్లేయర్‌గా నిలిచారు.
Details
టెస్టుల్లో అత్యధిక సార్లు ప్రత్యర్థి కెప్టెన్‌ను ఔట చేసిన కెప్టెన్లు
రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ చేతిలో ఆరుసార్లు ఔట్ అయ్యాడు. ఇక రిచీ బెనాడ్ ద్వారా టెడ్ డెక్‌స్టార్ ఐదుసార్లు, ఇమ్రాన్ ఖాన్ ద్వారా సునీల్ గవాస్కర్ ఐదు సార్లు ఔట్ అయ్యాడు.
మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 142 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో ఆకాశ్ దీప్(2), సుందర్(2) ఉన్నారు.