రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు
గౌహతిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. శుభ్ మన్ గిల్ తో కలిసి మొదటి వికెట్ కు 143 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓపెనర్ గా వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడోస్థానంలో నిలిచాడు. రికీ పాటింగ్ పేరిట ఉన్న 30 వన్డేల రికార్డును రోహిత్ సమం చేశాడు. భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (49), విరాట్ కోహ్లి (44) తర్వాతి స్థానంలో ఉన్నాడు. రోహిత్ చివరిసారిగా జనవరి 2020లో బెంగుళూరులో ఆస్ట్రేలియాపై 128 బంతుల్లో 119 పరుగులతో వన్డే శతకం సాధించాడు.
రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు
రోహిత్ శర్మ 149 వన్డే ఇన్నింగ్స్‌లలో 56.53 సగటుతో 7,519 పరుగులు చేశాడు. రోహిత్ కంటే ముందు టెండూల్కర్ (15,310), సౌరవ్ గంగూలీ (9,146) ఉన్నారు. మొదటి వన్డేలో ఆడిన రోహిత్ మొదటి ఓవర్ నుంచి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన పుల్ షాట్‌లు స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ కి ఇది 47వ హాఫ్ సెంచరీ కావడం గమానార్హం. దిల్షాన్ మధుశంక బౌలింగ్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. రోహిత్ 67 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.