IPL 2023లో రోహిత్ శర్మ ప్లాప్ షో
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2023లో 10 ఇన్నింగ్స్ అతను 10 ఇన్నింగ్స్ లో 200 పరుగులు కూడా చేయలేకపోయారు. అతని స్ట్రైక్ రేట్ చాలా చెత్తగా ఉంది. ఇక చైన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్ మెన్స్ గా చెత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. పవర్ ప్లేలో ఏకంగా ఎనిమిది సార్లు ఔట్ కావడం విశేషం. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున మాత్రమే 65 పరుగులను చేశాడు.
ఐపీఎల్ రోహిత్ శర్మ చెత్త రికార్డులివే!
ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ పేసర్ల చేతిలో ఎనిమిది సార్లు, స్పిన్నర్ల చేతిలో రెండు సార్లు ఔట్ అయ్యాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 237 మ్యాచ్ లు ఆడి 6063 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రోహిత్ 16సార్లు డక్ అవుట్ అయిన బ్యాటర్ గా మొదటిసారిగా నిలిచాడు. గత సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 268 పరుగులను మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ గత ఏడాది కాలంగా ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఫ్లాప్ అవుతున్నాడు ఒకట్రెండు మ్యాచ్‌లైతే ఏమో అనుకోవచ్చు కానీ, ఇలా ప్రతీసారి ఫెయిల్ అవ్వడం ఏంటని రోహిత్ శర్మ ఫ్యాన్స్ వాపోతున్నారు.