NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: ఆర్సీబీ పై రివేంజ్ తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ రెడీ!
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: ఆర్సీబీ పై రివేంజ్ తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ రెడీ!
    రేపు ఆర్సీబీతో తలపడనున్న ముంబై ఇండియన్స్

    IPL 2023: ఆర్సీబీ పై రివేంజ్ తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ రెడీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 08, 2023
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా 54వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు 10 మ్యాచ్ ల్లో ఐదు విజయాలు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ పరంగా ఎంఐ కంటే ఆర్సీబీ ముందు స్థానంలో ఉంది.

    ముంబైలోని వాంఖడే స్టేడియంలో మే 9న రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది.

    ఈ వేదికపై బెంగళూర్, ముంబాయి ఇండియన్స్ తొమ్మిదిసార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఆరుసార్లు గెలుపొందింది. ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్లో 31 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ముంబై 17 విజయాలను నమోదు చేయగా.. ఆర్సీబీ 14 విజయాలను సాధించింది.

    Details

    ఈ మ్యాచ్ లో బద్దలయ్యే రికార్డులివే

    ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఎలాగైనా సొంత మైదానంలో ఆర్సీబీని ఓడించాలని ముంబై ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది.

    ఆర్సీబీపై వార్నర్ 861 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 786 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇంకా 76 పరుగులు చేస్తే వార్నర్ రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

    MI కోసం 5,000 పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ శర్మకు ఇంకా 107 పరుగులు కావాలి. జోఫ్రా ఆర్చర్ 50వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.

    RCB తరుపున 100 వికెట్ల క్లబ్లో చేరడానికి హర్షల్ పటేల్ మూడు వికెట్లను పడగొట్టాలి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబయి ఇండియన్స్
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    తాజా

    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్
    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్

    ముంబయి ఇండియన్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..? క్రికెట్
    WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల క్రికెట్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ క్రికెట్
    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025