
Rohit Sharma: దిగ్గజాలను దాటేందుకు హిట్ మ్యాన్ రెడీ.. వన్డే క్రికెట్‌లో అరుదైన మైలురాయికి దగ్గరలో రోహిత్ శర్మ!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇంకా 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా చరిత్రలో నిలుస్తాడు. ఈ ఘనత సాధిస్తే సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ లాంటి దిగ్గజాలను అధిగమించనున్నాడు. ఈ విభాగంలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక రోహిత్ శర్మ ఇప్పటివరకు 259 ఇన్నింగ్స్‌ల్లో 10,987 పరుగులు చేశాడు.
Details
మరో సెంచరీ సాధిస్తే భారత మూడో ఆటగాడిగా రికార్డు
ఈ రికార్డును ఇంగ్లాండ్‌తో బుధవారం జరగనున్న మూడో వన్డేలో సాధించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ (119; 90 బంతుల్లో) శతకంతో అదరగొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. వన్డేల్లో ఇది రోహిత్ 32వ సెంచరీ, అంతర్జాతీయ క్రికెట్‌లో 49వ శతకం. మరో సెంచరీ సాధిస్తే 50 అంతర్జాతీయ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ ఘనత సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లీ (81) లకు మాత్రమే ఉంది.
Details
వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్లే
1. విరాట్ కోహ్లీ (భారత్) - 222 ఇన్నింగ్స్‌లు 2. సచిన్ టెండూల్కర్ (భారత్) - 276 ఇన్నింగ్స్‌లు 3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 286 ఇన్నింగ్స్‌లు 4. సౌరబ్ గంగూలీ (భారత్) - 288 ఇన్నింగ్స్‌లు 5. జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) - 293 ఇన్నింగ్స్‌లు 6. కుమార సంగక్కర (శ్రీలంక) - 318 ఇన్నింగ్స్‌లు 7. ఇంజామామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) - 324 ఇన్నింగ్స్‌లు 8. సనత్ జయసూర్య (శ్రీలంక) - 354 ఇన్నింగ్స్‌లు 9. మహేల జయవర్దెనె (శ్రీలంక) - 368 ఇన్నింగ్స్‌లు