NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ.. 
    మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..

    Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెస్టు క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి మర్యాద పూర్వకంగా సమావేశం కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

    ముంబయిలోని సీఎం అధికారిక నివాసమైన 'వర్ష'లో రోహిత్ శర్మ ఫడ్నవీస్‌ను కలిసారు.

    ఈ భేటీ అనంతరం ఫడ్నవీస్ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.

    వివరాలు 

    రోహిత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు

    "భారత క్రికెట్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన రోహిత్ శర్మను నా నివాసమైన వర్షలో కలవడం సంతోషంగా ఉంది. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయనకు భవిష్యత్తులో మరింత విజయాలు అందాలని ఆకాంక్షిస్తున్నాను," అంటూ ఆయన రోహిత్‌తో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు.

    సీఎంతో రోహిత్ సమావేశమయ్యారు, ఫొటోలు బయటకొచ్చాయి. వెంటనే రోహిత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మోత మోగించాయి.

    సోషల్ మీడియా అంతా ఈ అంశం చుట్టూ గిరగిరా తిరుగుతుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    దాదాపు 11 సంవత్సరాల పాటు భారత టెస్ట్ జట్టులో కొనసాగిన రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.

    వివరాలు 

    11 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌ల్లో 4301 పరుగులు 

    ఆయన 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌పై అద్భుతమైన డెబ్యూ ఇన్నింగ్స్ ఆడి, తన తొలి టెస్టులోనే 177 పరుగులు చేసి మెరిశారు.

    మొత్తంగా 67 టెస్టులు ఆడిన రోహిత్, 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.

    2019లో భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 212 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.

    టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 16వ స్థానాన్ని రోహిత్ ఆక్రమించారు.

    అయితే, కెరీర్ ఆరంభంలో రోహిత్‌కు స్థిరమైన స్థానం దక్కించడం కొంత క్లిష్టంగా మారింది.

    వివరాలు 

    దక్షిణాఫ్రికాపై వరుసగా శతకాలు

    2013 నుంచి 2018 మధ్య కాలంలో కేవలం 27 టెస్టులు మాత్రమే ఆడి, 47 ఇన్నింగ్స్‌లలో 39.63 సగటుతో 1,585 పరుగులు చేశారు. ఈ కాలంలో మూడు శతకాలు, పదిహేను అర్ధశతకాలు నమోదు చేశారు.

    2019లో ఇన్నింగ్స్ ఓపెనర్ బాధ్యతలు స్వీకరించిన రోహిత్, టెస్ట్ కెరీర్‌ను మళ్లీ మలుపు తిప్పారు.

    విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై వరుసగా శతకాలు బాదడం ద్వారా తన క్లాస్‌ను మరోసారి నిరూపించారు.

    అనంతరం జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో రోహిత్ 40 టెస్టుల్లో పాల్గొని, 41.15 సగటుతో మొత్తం 2,716 పరుగులు సాధించారు.

    ఈ సమయంలో ఆయన తొమ్మిది శతకాలు, ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశారు.

    వివరాలు 

    అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 10వ స్థానంలో రోహిత్ 

    డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా, అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచారు.

    అంతర్జాతీయంగా ఈ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 10వ స్థానంలో స్థానం సంపాదించారు.

    2023లో యూకేలో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్, ఆ మ్యాచ్‌లో జట్టు ఓటమి పాలైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దేవేంద్ర ఫడణవీస్‌ చేసిన ట్వీట్ 

    It was great to welcome, meet and interact with Indian cricketer Rohit Sharma at my official residence Varsha. I extended my best wishes to him on his retirement from Test cricket and for continued success in the next chapter of his journey!@ImRo45#Maharashtra #Mumbai… pic.twitter.com/G0pdzj6gQy

    — Devendra Fadnavis (@Dev_Fadnavis) May 13, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    దేవేంద్ర ఫడణవీస్‌

    తాజా

    Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..  రోహిత్ శర్మ
    US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం అమెరికా
    Official : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు  విజయ్ దేవరకొండ
    AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ భేటీ  ఆంధ్రప్రదేశ్

    రోహిత్ శర్మ

    Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. కేవలం 50 పరుగులే దూరం  సచిన్ టెండూల్కర్
    Rohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్! రాహుల్ ద్రావిడ్
    Rohit Sharma: ఫ్యాన్స్‌కి అసలైన కిక్.. సిక్సర్‌తో రోహిత్ శర్మ సెంచరీ టీమిండియా
    Rohit Sharma: దిగ్గజాలను దాటేందుకు హిట్ మ్యాన్ రెడీ.. వన్డే క్రికెట్‌లో అరుదైన మైలురాయికి దగ్గరలో రోహిత్ శర్మ! టీమిండియా

    దేవేంద్ర ఫడణవీస్‌

    Devendra Fadnavis: రాజకీయాల్లో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. మహారాష్ట్ర సీఎం స్థాయికి భారతదేశం
    Devendra Fadnavis: మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుదీరింది.. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం భారతదేశం
    Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష దిల్లీ
    Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది! మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025