Rohit Sharma: మరో గొప్ప రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. ఇక 22 పరుగులే అవసరం!
టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో మరో అరుదైన ఘనతకు దగ్గరయ్యాడు. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో హాఫ్ సెంచరీ హిట్ మ్యాన్ చెలరేగాడు. ఇక వన్డేల్లో 22 పరుగులు చేస్తే 10వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా అతను అవతరించన్నాడు. ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచులో ఆ రికార్డును బద్దలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీలంకపై రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. గతంలో అత్యధికంగా శ్రీలంకపై 264 రన్స్ బాదిన విషయం తెలిసిందే.
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన హిట్ మ్యాన్
ఇప్పటివరకూ టీమిండియా తరుఫున 247 వన్డేలు ఆడిన రోహిత్ 9978 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలను బాదాడు అదే విధంగా వన్డే ఫార్మాట్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ రికార్డుకెక్కాడు. ఇక శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.