Loading...
Rohit Sharma: ముంబై కెప్టెన్సీపై రోహీత్‌ కీలక వ్యాఖ్యలు...ఆకాష్‌ ఫోన్‌ చేస్తేనే
ముంబై కెప్టెన్సీపై రోహీత్‌ కీలక వ్యాఖ్యలు...ఆకాష్‌ ఫోన్‌ చేస్తేనే

Rohit Sharma: ముంబై కెప్టెన్సీపై రోహీత్‌ కీలక వ్యాఖ్యలు...ఆకాష్‌ ఫోన్‌ చేస్తేనే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 28, 2026
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. రోహిత్‌ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బాధ్యతను స్వీకరించేందుకు రోహిత్‌ మొదట్లో సిద్ధంగా లేడట. మళ్లీ సారథిగా వ్యవహరించాలా? వద్దా? అనే విషయంలో కొంత సందిగ్ధంలో ఉన్నట్లు వెల్లడించాడు. హార్దిక్‌ పాండ్య పంజాబ్‌ కింగ్స్‌కు బదిలీ కావడంతో ముంబై యాజమాన్యం రోహిత్‌కు మరోసారి పగ్గాలు అప్పగించింది.

Details

ఆకాష్‌ అంబానీ ఫోన్‌తో మారిన ఆలోచన

ముంబై ఇండియన్స్‌ యజమాని ఆకాష్‌ అంబానీ స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడిన తర్వాతే రోహిత్‌ ఈ నిర్ణయంపై ఆలోచించాడట.

జట్టును ముందుకు ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ఇద్దరూ చర్చించుకున్నారు.

ఆ సమయంలో మళ్లీ కెప్టెన్సీ తీసుకుంటావా? అని ఆకాష్‌ అడగడంతో రోహిత్‌ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.

ఇటీవలి సీజన్లలో జట్టులో చాలా మార్పులు జరిగాయని, తాను మానసికంగా సిద్ధంగా ఉన్నానో లేదో తెలుసుకోవడానికి భార్యతో కూడా చర్చించి కొంత సమయం తీసుకున్నట్లు చెప్పాడు.

Details

పదేళ్ల అనుబంధం.. మళ్లీ బాధ్యత

చివరకు ముంబై ఇండియన్స్‌కు సరైన దిశానిర్దేశం అవసరమని భావించి కెప్టెన్సీని స్వీకరించేందుకు అంగీకరించాడు.

దాదాపు దశాబ్ద కాలంగా ఈ జట్టుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, దాని కోసం మరోసారి ఈ సవాలును తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు.

హార్దిక్‌ పాండ్య స్థానంలో రోహిత్‌ తిరిగి కెప్టెన్‌గా రావడం అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచింది.

39 ఏళ్ల వయసులో మరోసారి జట్టును నడిపించేందుకు సిద్ధమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT

Details

ట్రోఫీ కంటే ఆటను ఆస్వాదించడమే ముఖ్యం

2020లో చివరిసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

గత ఆరేళ్లుగా జట్టు ప్రదర్శనపై డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ అసంతృప్తి ఉండేదని రోహిత్‌ తెలిపాడు.

ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం కంటే, జట్టుగా తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోవడమే ఎక్కువ బాధించిందన్నాడు.

ఈసారి ట్రోఫీ గురించే ఆలోచించకుండా మైదానంలో ఆటను ఆస్వాదించాలని ఆటగాళ్లకు సూచించినట్లు చెప్పాడు.

మ్యాచ్‌ల ఫలితాల ఒత్తిడిని పక్కనపెట్టి, జట్టుగా కలిసి ఆడటమే తమ తొలి లక్ష్యమని స్పష్టం చేశాడు.

ADVERTISEMENT