Page Loader
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ను ట్రోల్ చేసిన హిట్ మ్యాన్
బౌలింగ్ చేస్తున్న అమిర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ను ట్రోల్ చేసిన హిట్ మ్యాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా యువ క్రికెటర్లతో జోకులేస్తూ, నవ్వుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఆటగాళ్లతో అప్పుడప్పుడు స్టెప్పులేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా హిట్ మ్యాన్ బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ తో కలిసి ఓ టీవీ కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఈ యాడ్స్‌లో ఛాన్స్ దొరికినప్పుడల్లా అమిర్ ఖాన్‌ను రోహిత్ ఆడుకున్నాడు. తాజాగా ఈ వీడియోలను రోహిత్ శర్మ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనిపై అభిమానులు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ యాడ్‌లో బౌలింగ్ చేస్తున్న అమిర్ ఖాన్.. రోహిత్ ను ఉద్ధేశించి నీ మిడిల్ స్టంప్ ఎగిరిపోతుంది అంటూ హెచ్చరిస్తాడు.

రోహిత్ శర్మ

రోహిత్ దెబ్బకు ఆల్ ఈజ్ వెల్ అన్న అమిర్ ఖాన్

తీరా బాల్ వేసిన తర్వాత రోహిత్ తనదైన స్టైల్‌లో దానిని అమిర్ తలపై నుంచి బలంగా బాదుతాడు. ఆ బాల్ ను తప్పించుకున్న అమిర్.. ఆల్ ఈజ్ వెల్ అంటూ మళ్లీ చేయడానికి ముందుకెళ్తాడు. ఇక మరో యాడ్ లో డగౌట్ లో కూర్చొని బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న అమీర్.. రోహిత్ ను చూసి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ తనకే వస్తుందని చెబుతాడు. దీనికి రోహిత్ శర్మ ఎం లాభం మీరు ఎలాగూ అవార్డులు తీసుకోవడానికి వెళ్లరు కాదా అంటూ స్ట్రాంగ్ పంచ్ వేస్తాడు. ఈ యాడ్‌‌లో రోహిత్ శర్మతో పాటు రాహుల్ చాహర్ కూడా ఉండడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిర్ తలపై నుంచి బలంగా షాట్ కొట్టిన రోహిత్‌శర్మ