రోహిత్ శర్మ Vs హార్ధిక్ పాండ్యా.. గురు శిష్యుల్లో ఎవరు పైచేయి సాధిస్తారో!
ఐదుసార్లు ఐపీఎల్ టైటిట్ గెలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా గతంలో రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై తరుపున ఆడాడు. 2002 సీజన్ నుంచి పాండ్యా ముంబైని వీడి గుజరాత్ సారిథిగా నియమితులయ్యాడు. ఇప్పుడు రోహిత్, హార్ధిక్ ప్రత్యర్థులుగా మారడంతో గురు, శిష్యుల మధ్య పోరుని అభిమానులు భావిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా లో ఉన్న గుజరాత్.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్స్ కు మరింత చేరువ కావాలని భావిస్తోంది. ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతున్న ముంబై కూడా తమ టీంను ఎలాగైనా ఫ్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాలని కలలు కంటోంది.
పటిష్టంగా ఉన్న ఇరు జట్లు
ఈ సీజనో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ముంబై, తర్వాత పంజాబ్ చేతిలో ఓడిపోయింది. రోహిత్ దూకుడుగా ఆడుతున్నా భారీ ఇన్నింగ్స్ ను నమోదు చేయడం లేదు. సూర్యకుమార్ ఫామ్ లోకి రావడం ముంబైకి కలిసొచ్చే అంశం. తిలకవర్మ నిలకడగా ఆడుతూ కీలక ఆటగాడిగా మారాడు. టిమ్ డేవిడ్ ఫామ్ లోకి వస్తే ముంబాయికి తిరుగుండదని చెప్పొచ్చు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నిలకడగా మంచి స్కోర్లు సాధిస్తున్నాడు. అయితే అభివన్ మనోహర్, డేవిడ్ వార్నర్, రాహుల్ తెవాటియా దూకుడుగా ఆడితే గుజరాత్ సమిష్టిగా రాణించే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సొంత మైదానంలో జరుగుతుండటం గుజరాత్ కు కలిసొచ్చే అంశం.