Sunil Gavaskar: రోహిత్.. ఆ షాట్ ఆడడం తప్పు : సునీల్ గవాస్కర్
టీమిండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకు పరాభావం ఎదురైంది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక భారత ఓటమిపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. అయితే రోహిత్ ఆ ఒక షాట్ ఆడకుండా ఉండాల్సింది అంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. మొదట్లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ రోహిత్, ఆ తర్వాత మరో సిక్సర్ కు ట్రై చేయడానికి వెళ్లి చివరికి వికెట్‌ను కోల్పోయాడు. ఈ అంశంపై సునీల్ గవాస్కర్ మాట్లాడారు.
రోహిత్ శర్మ ఔట్ కావడమే మైనస్ పాయింట్
రోహిత్ శర్మ ఔట్ కావడమే ఫైనల్లో టర్నింగ్ పాయింట్ అని, ఆ ఓవర్లలో అప్పటికే ఒక సిక్సర్, ఫోర్ కొట్టి పది పరుగులు రాబట్టాడని గవాస్కర్ చెప్పారు. ఈ క్రమంలో మళ్లీ సిక్సర్ కు ప్రయత్నించకుండా ఉండుంటే బాగుండేదని, ఆ బాల్ బంతిని సరిగ్గా తాకి ఉంటే సిక్సర్ పోయేదిని చెప్పాడు. ఆ దశలో అంత దూకుడు అవసరం లేదని సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.