
యూరోపా లీగ్ ఫైనల్‌లో సెవిల్లాతో తలపడనున్న రోమా
ఈ వార్తాకథనం ఏంటి
UEFA సెమీ-ఫైనల్స్ లో యూరోపా లీగ్ విజేత సెవిల్లా గురువారం జువెంటస్ ను 2-1తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలి అర్ధభాగంలో సెవిల్లా తరఫున ఎరిక్ లామెలా గోల్ చేసి ఆకట్టుకున్నాడు. AS రోమా వరుసగా రెండవ సీజన్‌లో UEFA యూరోపియన్ పోటీలో ఫైనల్‌కు చేరుకుంది.
రోమా, బేయర్ లెవర్‌కుసేన్‌ను 1-0తో ఓడించింది. అదే విధంగా రోమా తన తొలి ఎడిషన్‌లో యూరోపా కాన్ఫరెన్స్ లీగ్‌ను గెలుచుకుంది. AS రోమా మేనేజర్ జోస్ మౌరిన్హో తన కెరీర్‌లో ఆరో యూరోపియన్ ఫైనల్ కి చేరుకోవడం విశేషం.
మౌరిన్హో రెండు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు, రెండు యూరప్ లీగ్ ట్రోఫీలు, కాన్ఫరెన్స్ లీగ్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
Details
యూరోపియన్ లీగ్ లో ఆరుసార్లు విజేతగా నిలిచిన సెవిల్లా
సెవిల్లా యూరోపా లీగ్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో 6-0తో అద్భుత రికార్డును కలిగి ఉంది. సెవిల్లా యూరోపా లీగ్ నాకౌట్ దశల్లో స్వదేశంలో ఆడుతున్నప్పుడు ఎప్పుడు మ్యాచును ఓడిపోలేదు.
రామన్ సాంచెజ్-పిజ్జువాన్ (D2 L1)లో జరిగిన పోటీలో సెవిల్లా తమ చివరి 28 మ్యాచుల్లో 25 గెలిచి సత్తా చాటింది.
బుడాపెస్ట్‌లోని పుస్కాస్ అరేనాలో మే 31న యూరోపా లీయు ఫైనల్‌లో సెవిల్లా మరియు AS రోమా తలపడతాయి.