ప్రీమియర్ లీగ్ లో చెల్సియా వరుసగా ఐదో ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రీమియర్ లీగ్ లో చెల్సియా చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్ లో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా బ్రెంట్‌ఫోర్డ్‌తో జరిగిన మ్యాచ్ లో చెల్సియా 0-2 తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
అదే విధంగా ఛాంపియన్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ లో రియల్ మాడ్రిడ్ చేతిలో చెల్సియా పరాజయం పాలైన విషయం తెలసిందే. చెల్సియా 1993 తర్వాత మొదటి సారిగా వరుసగా ఐదు మ్యాచ్ లో ఓడిపోయింది.
చెల్సియా ప్రీమియర్ లీగ్‌లో 32 గేమ్‌లలో 39 పాయింట్ల సాధించి 11వ స్థానంలో కొనసాగుతోంది.
Details
తొమ్మిదో స్థానంలో బ్రెంట్ ఫోర్డ్
చెల్సియా ఈ సీజన్‌లో 35 గోల్స్ మాత్రమే చేసింది. అదే సమయంలో బ్రెంట్‌ఫోర్డ్ 33 గేమ్‌లలో 47 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో ఉంది.
మరో మ్యాచ్ లో యునైటెడ్ ను లివర్ పూల్ 2-1 తేడాతో ఓడించింది. లివర్‌పూల్ 32 గేమ్‌లలో 53 పాయింట్లు సాధించి ఆరో స్థానానికి చేరుకుంది. ఈ సీజన్‌లో లివర్‌పూల్ 15వ లీగ్ విజయాన్ని సాధించింది.
ఫుల్ హామ్ పై ఆస్టన్ విల్లా 1-0 విజయం సాధించింది. ప్రస్తుతం ఆస్టన్ విల్లా 33 మ్యాచ్‌ల్లో 54 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.