భారీ ఆఫర్లను తిరస్కరించి.. చివరకి మెగా డీల్ పట్టిన రొనాల్డ్
ప్రపంచకప్ నుంచి కన్నీటితో నిష్క్రమించిన సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి క్రేజ్ కొంచె కూడా తగ్గలేదు. ప్రస్తుతం సౌది అరేబియాకు చెందిన అల్-నాసర్ జట్టు క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ చూసి పిచ్చెక్కిపోయింది. ప్రస్తుతం పొర్చుగల్ తరుపున అత్యధిక పారితోషకం తీసుకొనే ఆటగాడిగా నమోదయ్యాడు. క్రిస్టియానో రొనాల్డ్ ఐరోపా తరుపున ఆడకపోవచ్చు. అతడు సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్కు ఆడబోతున్నట్లుగా తెలిసింది. సౌదీ అరేబియా పుట్ బాల్ క్లబ్ జట్టు అన్ నాసర్ జట్టుతో రొనాల్డ్ ఒప్పందం డీల్ కుదుర్చుకున్నాడు. డీల్ జరగడానికి ముందు అల్-నాసర్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 8.6 లక్షలు మాత్రమే. మంగళవారం ఉదయం నాటికి ఆ ఫాలోవర్ల సంఖ్య 78 లక్షలకు ఎగబాకడం విశేషం.
ఇది నాకు కొత్త ఛాలెంజ్ : రొనాల్డ్
అల్ నాసర్ అధ్యక్షుడు ముసల్లి అల్ముఅమ్మర్ మాట్లాడుతూ రొనాల్డ్ ఫుట్ బాల్ చరిత్రలో అత్యత్తుమ అటగాడు అతనికి ఎక్కువ ఆదాయం ఉండడం సర్వసాధారణం అని చెప్పారు. రొనాల్డ్ మాజీ మంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జువెంటస్ ఫార్వర్డ్ లు ఐరోపా, ఉత్తర అమెరికా ఆఫర్లను తిరస్కరించి సౌదీ ప్రో లీగ్ ల్ ఆడనున్నారు. "నా జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఐరోపాలో నా పని పూర్తయింది. నేను ప్రతిదీ గెలిచాను,చాలా క్లబ్‌లు నాతో సంతకం చేయడానికి ప్రయత్నించాయి. ఐరోపాలోని అత్యంత ముఖ్యమైన క్లబ్‌ల కోసం ఆడాను. ఇది నాకు కొత్త ఛాలెంజ్," అని రొనాల్డ్ పేర్కొన్నారు.