
IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్లేఆఫ్స్‌కు అర్హత పొందేందుకు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి.
కానీ టాప్-4లో స్థానం దక్కించుకోవాలంటే మిగిలిన మ్యాచుల్లో విజయం అత్యంత కీలకమవుతోంది.
ప్రత్యేకంగా, టోర్నమెంట్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు క్వాలిఫయర్ మ్యాచుల్లో ఓటమి చవిచూసినప్పటికీ మరో అవకాశం లభించే క్రమంలో, ఈ నాలుగు జట్లు టాప్-2 స్థానాల కోసం మినీ యుద్ధాన్ని సాగిస్తున్నాయి.
వివరాలు
వాతావరణ సమస్యల కారణంగా వేదిక మార్పు
ఈరోజు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది.
ముందుగా ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాల్సి ఉండగా, వాతావరణ సమస్యల కారణంగా లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి (ఇకానా) క్రికెట్ స్టేడియానికి మార్చారు.
రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో లేదా జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
వివరాలు
ఎలిమినేట్ అయిన ఎస్ఆర్‌హెచ్ - జోష్‌లో ఆర్సీబీ
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో అదరగొడుతూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరనుంది.
అయితే, గత మ్యాచ్‌లో లక్నోపై గెలిచిన ఎస్ఆర్‌హెచ్ వారి ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లడంతో పాటు వారిని నేరుగా ఎలిమినేషన్ జోన్‌లోకి నెట్టింది.
అదే ఊపును కొనసాగిస్తూ ఈరోజు బెంగళూరును కూడా ఓడించి వారి టాప్ ప్లేస్ ఆశలకు అడ్డుకట్ట వేయాలని ఎస్ఆర్‌హెచ్ లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
ఆర్సీబీ vs ఎస్ఆర్‌హెచ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మొత్తం 24 సార్లు ఢీకొన్నాయి.
అందులో బెంగళూరు జట్టు 11 మ్యాచ్‌లలో విజయం సాధించగా, హైదరాబాద్ 13 మ్యాచ్‌లలో గెలిచింది.
చివరిగా జరిగిన ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే, ఆర్సీబీ మూడింట్లో విజయం సాధించగా, ఎస్ఆర్‌హెచ్ రెండు విజయాలు నమోదు చేసింది.
వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనా
విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జాకబ్ బేతెల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రషిక్ సలామ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా
అధర్వ్ టైడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, హర్ష్ దుబే, జీసన్ అన్సారీ, ఇషాన్ మలింగ.