LOADING...
IND vs SA: రెండో టెస్ట్ లో టీమిండియాపై 408 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
రెండో టెస్ట్ లో టీమిండియాపై 408 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం

IND vs SA: రెండో టెస్ట్ లో టీమిండియాపై 408 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్,సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య టీమిండియాఘోరంగా ఓటమి పాలైంది. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం సౌతాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది సౌతాఫ్రికా భారత్‌ను 408 పరుగుల తేడాతో ఓడించగా, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లకు సౌతాఫ్రికా స్పిన్నర్లు చుక్కలు చూపించారు. భారీ లక్ష్యానికి చేరడానికి ప్రయత్నించిన భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 260 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

వివరాలు 

భారత బ్యాట్స్‌మెన్‌లలో కనిపించని పోరాట స్పూర్తి

భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌటైంది. 550 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 140 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మార్కో జాన్సెన్ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లు తీసి భారత ఓటమికి ప్రధాన కారణమయ్యారు. ఐదో రోజు భారత్ డ్రా ద్వారా ఓటమిని తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ, భారత బ్యాట్స్‌మెన్‌లలో పోరాట స్పూర్తి కనిపించలేదు. కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు.ఐదో రోజు ప్రారంభంలోనే ధ్రువ్ జురెల్, పంత్ వికెట్లు కోల్పోయారు. అలాగే,నిన్నటి వరకు స్థిరంగా ఆడుతున్న సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14) కూడా తక్కువ స్కోరుతో అవుట్ అయ్యాడు.

వివరాలు 

 మూడు టెస్ట్ సిరీస్‌లలో భారత్ రెండు సార్లు క్లీన్ స్వీప్ 

ఓటమి ఖాయమైన సమయంలో, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌటై, 408 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో, గత మూడు టెస్ట్ సిరీస్‌లలో భారత్ రెండు సార్లు క్లీన్ స్వీప్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లు, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో చూపిన పట్టుదల, భారత్‌ను సిరీస్‌లో దారుణంగా దెబ్బతీసింది. డ్రా చేసే అవకాశం ఉన్నప్పటికీ, బ్యాట్స్‌మెన్ త్వరగా అవుట్ కావడంతో భారత్ ఆ అవకాశాన్ని కూడా దక్కలేదు.