జోఫ్రా ఆర్చర్ దెబ్బకు సౌతాఫ్రికా విలవిల
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడో వన్డేలో నిప్పులు చెరిగాడు. జోఫ్రా దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 81 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతని కెరీర్‌లో ఇది చెత్త ప్రదర్శన కావడంతో రెండో వన్డేలో అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమిపాలై సిరీస్‌ను ఇంగ్లండ్ కోల్పోయింది. కనీసం మూడో వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన ఇంగ్లండ్.. ఆర్చర్ పై నమ్మకంతో మూడో వన్డేలో చోటు కల్పించారు. రెండేళ్ల పాటు ఆటకు దూరమైన ఆర్చర్ మూడో వన్డేలో 9.1 ఓవర్లో 40 పరుగులిచ్చి ఆరు వికెట్లతో సౌతాఫిక్రాను శాసించాడు.
గౌరవాన్ని చాటుకున్న బట్లర్
ఆర్చర్ 19 వన్డేలో 22.73 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు, ఈ ఫార్మాట్‌లో 6 వికెట్లు తీసిన ఇంగ్లండ్ మూడో బౌలర్ గా చరిత్రకెక్కాడు ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ (6/24), పాల్ కాలింగ్‌వుడ్ (6/31) తో సత్తా చాటి వన్డేల్లో ఆర్చర్ కంటే ముందు ఉన్నారు. గతంలో క్రిస్ వోక్స్ వన్డేలో రెండుసార్లు ఆరు వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు సానుకూలమని చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచినప్పటికి తన అవార్డును ఆర్చర్‌కు ఇచ్చి అతనిపై ఉన్న గౌరవాన్ని పరోక్షంగా చాటుకున్నాడు.