దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పరువు నిలబెట్టుకున్న ఇంగ్లండ్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. 59 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మొదటి రెండు వన్డేలను కోల్పోయిన ఇంగ్లండ్.. మూడో వన్డేలో సత్తా చాటింది. జోస్ బట్లర్, డేవిడ్ మలన్ సెంచరీలతో రాణించగా, జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్ల తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బట్లర్ (127 బంతుల్లో 131, ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ మలాన్ (114 బంతుల్లో 118 ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చేలరేగాడు. చివర్లో మొయిన్ అలీ 23 బంతుల్లో 41 పరుగులతో మెరుగు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్యంతో బరిలోకి సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది.
వన్డేలో బట్లర్ అరుదైన రికార్డు
మలాన్ వన్డేలో తన మూడో శతకాన్ని నమోదు చేశాడు. సౌతాఫ్రికాపై మొదటి సెంచరీ, 15 వన్డేలో 53.66 సగటుతో 644 పరుగులు చేశాడు. బట్లర్ వన్డేలో తన 11వ సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై తన రెండవ సెంచరీని చేశాడు. ఇందులో 23 అర్ధ సెంచరీలు కూడా కలిగి ఉన్నాడు. బట్లర్ ఇప్పుడు 162 వన్డేల్లో 41.61 సగటుతో 4,536 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో 4,500కు పైగా పరుగులు చేసిన ఆరో ఇంగ్లిష్ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పునరాగమనం తర్వాత రెండో మ్యాచ్ ఆడిన ఆర్చర్ 9.1 ఓవర్లలో 6/40తో చేలరేగాడు. 19 వన్డేల్లో 22.73 సగటుతో 37 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.