LOADING...
Sachin Tendulkar Birthday: సందడిగా 'క్రికెట్ గాడ్' బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ పిల్లలతో ఆడిపాడిన సచిన్
సందడిగా 'క్రికెట్ గాడ్' బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ పిల్లలతో ఆడిపాడిన సచిన్

Sachin Tendulkar Birthday: సందడిగా 'క్రికెట్ గాడ్' బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ పిల్లలతో ఆడిపాడిన సచిన్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 24, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఆయన బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్న సమయంలో, సచిన్ మాత్రం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో చాలా సాధారణంగా, హృదయాన్ని తాకే విధంగా తన పుట్టినరోజును జరుపుకోవడం విశేషంగా నిలిచింది. సచిన్ టెండూల్కర్ దంతేవాడ జిల్లాలోని చిందనార్ అనే దూర ప్రాంత గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఇంద్రావతి నది తీరంలో ఉన్న ఈ గ్రామానికి ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా వెళ్లి, స్థానిక గిరిజన పిల్లలతో కలిసి తన బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు కుమార్తె సారా టెండూల్కర్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

వివరాలు

పిల్లలతో వాలీబాల్ ఆడిన సచిన్..

గ్రామంలో తాజాగా నిర్మించిన క్రీడా మైదానంలో సచిన్ గిరిజన పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. "హ్యాపీ బర్త్‌డే సచిన్ సర్" అంటూ పిల్లలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంగా మారింది. పిల్లలతో కలిసి సమయం గడిపిన సచిన్, వారితో వాలీబాల్ ఆడి వారిని ప్రోత్సహించారు. 'క్రికెట్ గాడ్'ను ప్రత్యక్షంగా చూసిన ఆ పిల్లల ఆనందం అపారంగా నిలిచింది.

వివరాలు

50కుపైగా క్రీడా మైదానాల నిర్మాణాలకు ఏర్పాట్లు..

తర్వాత సచిన్ అక్కడి క్రీడా మైదానాన్ని పరిశీలించి, దాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిని సత్కరించారు. ప్రస్తుతం దంతేవాడ జిల్లాలో 25 క్రీడా మైదానాలు పూర్తయ్యాయి, ఇంకా మరో 25 మైదానాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, ఇక్కడికి రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రతిభ ఉన్నా సరైన మైదానాలు లేకపోవడం గురించి తెలిసినప్పుడు తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని, తాను కూడా ఒకప్పుడు మైదానంలోనే తన ప్రయాణాన్ని ప్రారంభించానని అన్నారు. అంతేకాకుండా కేవలం 50 మాత్రమే కాకుండా 100కి పైగా క్రీడా మైదానాల నిర్మాణానికి సహకరిస్తానని ఆయన ప్రకటించారు.

Advertisement