Sachin Tendulkar: ఎంసీసీ గౌరవ సభ్యత్వంతో 'సచిన్ తెందుల్కర్'కు సత్కారం
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఘనంగా సత్కరించింది.
1838లో స్థాపించిన ఈ ప్రతిష్టాత్మక క్లబ్, సచిన్‌కు గౌరవ సభ్యత్వం అందజేసింది. 'ఆటకు అందించిన అద్భుతమైన సేవల్ని అభినందిస్తూ, సచిన్‌ను గౌరవ క్రికెట్ సభ్యత్వంతో సత్కరించామని ఎంసీసీ పేర్కొంది.
సచిన్, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన రికార్డు సాధించిన వ్యక్తి.
5 టెస్టుల్లో 44.90 సగటు, 58.69 స్ట్రైక్ రేటుతో 449 పరుగులు సాధించాడు.
Details
లవ్లీనా బోర్గోహెయిన్‌కు అరుదైన గౌరవం
ఇక టోక్యో ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ఆసియా బాక్సింగ్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా ఎంపిక చేశారు.
ప్రపంచ బాక్సింగ్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆసియా కౌన్సిల్ తాత్కాలిక కమిటీలో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ప్రతినిధులకు ప్రాధాన్యం ఇచ్చారు.
బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు. కార్యదర్శి హేమంతకుమార్ కాలిటా, కోశాధికారి దిగ్విజయ్ సింగ్‌లకు ఒలింపిక్ కమిషన్, ఫైనాన్స్-ఆడిట్ కమిటీలలో చోటు లభించింది.
నరేందర్‌కుమార్ నిర్వాణ్, డి.పి.భట్, డాక్టర్ కరణ్‌జీత్ సింగ్‌లకు వివిధ కమిటీల్లో స్థానం దక్కింది.