LOADING...
Arjun Tendulkar: సచిన్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ నిశ్చితార్థం.. సంపాదనపై నెట్‌జన్ల దృష్టి!
సచిన్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ నిశ్చితార్థం.. సంపాదనపై నెట్‌జన్ల దృష్టి!

Arjun Tendulkar: సచిన్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ నిశ్చితార్థం.. సంపాదనపై నెట్‌జన్ల దృష్టి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాడు. తాజాగా అతడికి నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్‌ మనుమరాలు సానియా చందోక్‌తో త్వరలో వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే సచిన్‌ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో అర్జున్‌ ఆదాయంపై అభిమానులు నెట్టింట ఆసక్తిగా వెతుకుతున్నారు.

Details

ఐపీఎల్‌ కెరీర్‌ నుంచి సంపాదన

2021లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన అర్జున్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అనంతరం 2023 వేలంలో మళ్లీ రూ.30 లక్షలకు తీసుకుంది. తాజా మెగావేలంలో కూడా అదే మొత్తంతో అతడిని ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కేవలం ఐదు మ్యాచులే ఆడే అవకాశం లభించినా, మొత్తం మీద అతడు ఐపీఎల్‌ ద్వారా రూ.1.40 కోట్లు సంపాదించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

Details

దేశవాళీ క్రికెట్‌ ప్రదర్శన

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికీ అడుగుపెట్టకపోయినా, అర్జున్‌ దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. గోవా తరఫున రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో ఏడాదికి సుమారు రూ.10 లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం. కుటుంబం నుంచి వచ్చిన ఆస్తులను కలిపి అర్జున్‌ సంపద విలువ ప్రస్తుతం రూ.22 కోట్లుగా అంచనా. ప్రస్తుతం అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. 2007లో సచిన్‌ తెందూల్కర్‌ రూ.39 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్తిలోనే వీరు నివసిస్తున్నారు.

Details

 పేస్‌ ఆల్‌రౌండర్‌గా అర్జున్‌

తండ్రిలా బ్యాటింగ్‌ రికార్డులు కాకుండా అర్జున్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్‌ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా స్పిన్‌ బౌలర్‌గా కూడా వికెట్లు సాధించాడు. అయితే అర్జున్‌ మాత్రం లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న ఈ యువ క్రికెటర్‌ ఇప్పటివరకు 17 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో పాల్గొని 37 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 532 పరుగులు నమోదు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన అర్జున్‌ మొత్తం మూడు వికెట్లు సాధించాడు.