వన్డే మ్యాచ్‌లు చాలా డల్‌గా ఉన్నాయి : సచిన్ టెండూల్కర్
గడుస్తున్నా కాలం కొద్దీ క్రికెట్‌లో చాలా మార్పులొస్తున్నాయి. ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్ రాగా.. దానిని 50 ఓవర్లకు కుదించారు. 2000 సంవత్సరంలో ధనాధన్ క్రికెట్ ను ప్రవేశపెట్టడంతో సక్సస్ అయింది. ఫ్రాంఛేజీ లీగ్ ల కారణంగా టెస్ట్, వన్డే ఫార్మాట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లాంగెస్ట్ ఫార్మాట్లపై అభిమానులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వన్డేలపై మనుగడపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాట్లాడారు. వన్డే ఫార్మాట్ చాలా బోర్ కొడుతోందని, చాలా డల్ గా ఉంటున్నాయని అన్నారు. దానికి కారణం రెండు కొత్త బాల్స్ ఉపయోగించడమేనని అతడు చెప్పాడు.
వన్డేలను టెస్టు క్రికెట్‌లాగా నాలుగు భాగాలు చేయాలి
వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉపయోగించడం వల్ల రివర్స్ స్వింగ్ చేసే ఛాన్స్ దక్కడం లేదని, 40 ఓవర్ ఆడుతున్నా కూడా బంతికి మాత్రం అది 20వ ఓవరే అవుతుందని, కానీ ఓ బంతి 30 ఓవర్ల తర్వాతే రివర్స్ అవుతుందని సచిన్ తెలియజేశాడు. వన్డే ఫార్మాట్ ను 25 ఓవర్ల చొప్పున టెస్ట్ క్రికెట్‌లాగా నాలుగు భాగాలు చేయాలని, టెస్టుల్లో అయితే 20 వికెట్లు ఉంటాయని, ఇక్కడైతే పది వికెట్లే ఉంటాయని, ఒకవేళ 25 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోతే, తర్వాత 25 ఓవర్లు ఉండవని సచిన్ స్పష్టం చేశారు..