వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో యూఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ రికార్డు
కీర్తిపూర్‌లో నేపాల్‌తో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో యుఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 41 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులను బద్దలు కొట్టాడు. ఏడో నెంబర్ లో బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్ 44 బంతుల్లో చేసిన రికార్డును చెరిపేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు
ఆసిఫ్ ఖాన్ సాధించిన రికార్డులివే
వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ గతంలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లో డివిలియర్స్ శతకం బాదేశాడు. కోరీ అండర్సన్ వెస్టిండీస్ పై 36 బంతుల్లో, షాహిద్ అఫ్రిది శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేశారు. ఆసిఫ్ ఇప్పుడు వన్డే సెంచరీని ఏడో స్థానంలో వచ్చి అత్యధిక స్ట్రైక్ రేట్(240.48) ను కలిగి ఉన్నాడు. అండర్-19 క్రికెట్‌లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆసిఫ్ గతేడాది మార్చిలో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆసిఫ్ 16 వన్డేల్లో 36.58 సగటుతో 439 పరుగులు చేశాడు.