RSA vs WI : వెస్టిండీస్‌ను హడలెత్తించిన రబడ.. దక్షిణాఫ్రికా విజయం
వెస్టిండీస్‌తో సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో రబడ 6 వికెట్ల తీసి చెలరేగడంతో విండీస్ 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో సఫారీ జట్టు 1-0 అధిక్యంలోకి వెళ్లింది. మొదటి ఇన్నింగ్స్ లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులు చేసిన మర్ర్కమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. రబడ ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్టుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 116 రన్స్‌కు ఆలౌట్ అయింది. సెంచరీ వీరుడు మర్‌క్రమ్ 47 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు.
రబడ సాధించిన అరుదైన రికార్డులివే
రబడ 59 టెస్టుల్లో 22.53 సగటుతో 276 వికెట్లు పడగొట్టాడు. రబడా అరంగేట్రం చేసినప్పటి నుండి నాథన్ లియాన్ (317), రవిచంద్రన్ అశ్విన్ (322) మాత్రమే ఎక్కువ టెస్ట్ వికెట్లు తీసిన ఆటగాళ్లగా నిలిచారు. ఈ స్పీడ్‌స్టర్ 30 స్వదేశీ టెస్టుల్లో 169 వికెట్లను సొంతం చేసుకున్నాడు. స్వదేశానికి దూరంగా, అతను 29 మ్యాచ్‌లలో 107 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన వరుస ఓటముల అనంతరం దక్షిణాఫ్రికా విజయం సాధించింది. రెండో టెస్టు జొహన్నెస్‌బర్గ్‌లో మార్చి 8న జరగనుంది.