LOADING...
SAFF Championship : డ్రాగా ముగిసిన భారత్, కువైట్ మ్యాచ్
భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి

SAFF Championship : డ్రాగా ముగిసిన భారత్, కువైట్ మ్యాచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

సాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కువైట్‌తో జరిగిన మ్యాచులో భారత్ పుట్‌బాల్ జట్టు 1-1తో సమానంగా నిలిచింది. దీంతో ఇరు జట్లు సమానంగా పాయింట్లు పంచుకున్నాయి.

Details

సెమీఫైనల్లో లెబనాన్ తో తలపడనున్న భారత్

ప్రస్తుతం గ్రూప్-ఎలో భారత్ మొదటి స్థానాన్ని సాధించింది. సెమీఫైనల్‌లో భారత్ లెబనాన్‌తో ఆడనుంది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ ఇరువైపులా అద్భుతంగా ఆడగా, కువైట్ ఎక్కువగా ఎడమవైపునే ఆధారపడినట్లు స్పష్టమవుతోంది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే భారత జట్టు ఆధిక్యం సాధించగా, కానీ ఆకాష్ మిశ్రా ఇచ్చిన క్రాస్‌ను గోల్ మార్చడంలో విఫలమయ్యాడు. బాక్స్ బయట నుంచి షాదాబ్ అల్ ఖల్దీ కొట్టిన రిప్పర్ షాట్ లక్ష్యం తప్పిపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అనంతరం నెమ్మదిగా భారత్ మ్యాచుపై పట్టు సాధించి, మొత్తానికి డ్రాగా మ్యాచును ముగించింది.