భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్
పాకిస్థాన్ ను భారత్ ఫుట్ బాల్ జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచులో మ్యాచులో భారత్ 4-0తేడాతో పాకిస్థాన్‌పై గెలుపొందింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ నిమిషంలో,16వ నిమిషంలో,74వ నిమిషంలో) మూడు గోల్స్ చేశాడు. మరో గోల్ ను 84 నిమిషంలో ఉదాంత కుమమ్ సాధించాడు. తొలి అర్ధభాగంలో 2-0తో ముందంజలో ఉన్న భారత్ సెకండ్ హాఫ్‌లో మరో రెండు గోల్స్ చేయడంతో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి టీమిండియా దూకుడుగా ఆడుతూ పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
4-0 తేడాతో భారత్ ఘన విజయం
ఆట 10వ నిమిషంలో ఛెత్రి పాకిస్తాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టి భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. అయితే మరో 6 నిమిషాల వ్యవధిలో భారత్‌కు పెనాల్టీ లభించింది. దీన్ని సునీల్ ఛెత్రి గోల్‌గా మలిచి భారత్‌కు రెండో గోల్‌ను అందించాడు. తొలి అర్ధభాగంలో రెండు గోల్స్ చేసిన భారత్ 76వ నిమిషంలో ఛెత్రిని పాక్ ఢిపెండర్ అడ్డుకున్నాడు. దీంతో భారత్‌కు మరో పెనాల్టీ లభించింది. ఛెత్రి మళ్లీ గోల్ చేయడంతో ఈ మ్యాచులో హ్యాట్రిక్ గోల్స్‌ను సాధించాడు. ఇక 81 నిమిషంలో భారత ప్లేయర్ ఉదాంత పాక్ గోల్ కీపర్‌ను తికమక పెట్టి సునాయాసంగా గోల్ కొట్టాడు. దీంతో భారత్ 4-0తో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది.