Page Loader
Foot Ball: ఐదేళ్ల తర్వాత పాక్‌తో మ్యాచ్.. ఫేవరెట్‌గా భారత్
ఇండియా, పాకిస్థాన్

Foot Ball: ఐదేళ్ల తర్వాత పాక్‌తో మ్యాచ్.. ఫేవరెట్‌గా భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2023
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాకు వస్తుందో రాదో తెలియదు కానీ ఆ దేశ ఫుట్‌ బాల్ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఫుట్ బాల్ జట్టు నేడు ఇండియాకు రానుంది. వాస్తవానికి పాకిస్తాన్ జట్టు రెండు రోజుల ముందే భారత్ కు చేరుకోవాల్సి ఉండగా, వీసా సమస్య కారణంగా వారి ప్రయాణం ఆలస్యమైంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు భారత్ పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇంటర్‌కాంటినెంటల్ కప్ విజయంతో ఉన్న భారత ఫుట్‌బాల్ జట్టు శాప్ ఛాంపియన్ షిప్ 2023లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

Details

అరుదైన రికార్డుకు చేరువలో సునీల్ ఛెత్రి

ఎనిమిదిసార్లు ఛాంపియన్‌గా అవతరించిన భారత్ గ్రూప్-ఎలో నేపాల్, కువైట్, పాకిస్తాన్‌లతో కలిసి ఉంది. లెబనాన్, మాల్దివులు, భూటాన్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఇప్పటివరకూ 137 మ్యాచులు ఆడి 87 గోల్స్ చేశాడు. ఈ టోర్నీలో మరో మూడు గోల్స్ చేస్తే మలేసియా ఆటగాడు మొఖ్తార్ దహరి పేరిట ఉన్న (89గోల్స్) రికార్డును బ్రేక్ చేస్తాడు. భారత జట్టు గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. మాల్దివులు (2008, 2018), బంగ్లాదేశ్‌ (2003)లో విజేతలుగా నిలిచాయి