LOADING...
Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు అరుదైన రికార్డు.. వేగంగా 3 వేల పరుగులు పూర్తి
సాయి సుదర్శన్‌కు అరుదైన రికార్డు.. వేగంగా 3 వేల పరుగులు పూర్తి

Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు అరుదైన రికార్డు.. వేగంగా 3 వేల పరుగులు పూర్తి

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 క్రికెట్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. అతడు కేవలం 79 మ్యాచ్‌ల్లోని 78 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ పేరిట ఉండేది. మార్ష్ 87 మ్యాచ్‌ల్లోని 85 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు పూర్తి చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ ఇప్పటివరకు 53 ఇన్నింగ్స్‌లు ఆడి 2347 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 3 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. తమిళనాడు జట్టు తరఫున 25 ఇన్నింగ్స్‌లలో 670 పరుగులు సాధించాడు. ఒక సెంచరీతో పాటు మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

వివరాలు

3 వేల పరుగుల మైలురాయి..

టీ20ల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లలో 3000 పరుగుల క్లబ్‌లో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నారు. తిలక్ వర్మ 92 మ్యాచ్‌ల్లోని 90 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, రుతురాజ్ గైక్వాడ్ 93 మ్యాచ్‌ల్లోని 91 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను అందుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 28 బంతుల్లో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ అర్ధశతకం అతడికి వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం ప్రత్యేకతగా నిలిచింది.

వివరాలు

టీ20 రికార్డులు ఇవే..

ఇంతకుముందు హార్దిక్ పాండ్యా 2022 సీజన్‌లో వరుసగా మూడు అర్ధశతకాలు నమోదు చేశాడు. అలాగే 2024-25 సీజన్‌లో సాయి సుదర్శన్ కూడా వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు మాత్రం తన సొంత రికార్డునే అధిగమించి కొత్త మైలురాయి చేరుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో సాయి సుదర్శన్ గత ఏడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 100, 87, 6, 57, 55, 61, 53 పరుగులు చేశాడు. మొత్తం ఈ సీజన్‌లో అతడు ఒక సెంచరీతో పాటు ఆరు అర్ధశతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం 554 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement