Page Loader
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ విజయాలపై ఓ కన్నేయండి
బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ విజయాలపై ఓ కన్నేయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2023
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సైనా నెహ్వాల్ నేడు 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె సాధించిన విజయాలను కొన్ని తెలుసుకుందాం. ఒలంపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత షట్లర్‌గా సైనాకు రికార్డు ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా ఆమె ఆ అరుదైన ఫీట్‌ను సాధించింది. ఆమె హర్యానాలోని హిస్సార్‌లో జన్మించింది. 2009లో ప్రతిష్టాత్మకమైన BWF సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. మార్చి 17, 1990న జన్మించిన సైనా 8ఏళ్ల వయస్సులో బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టింది. సైనా ఆసియా శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సత్తాచాటి ప్రపంచ వేదికపై మొదటి ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్ సాధించిన రికార్డులివే

2008లో సైనా నెహ్వాల్ ఒలింపిక్ క్వార్టర్‌ఫైనల్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో, సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో సైనా స్వర్ణం, కాంస్యం గెలుచుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని సాధించి, యువతకు ఆదర్శంగా నిలిచింది. 2014లో సైనా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న తర్వాత అద్భుత ప్రదర్శనతో అకట్టుకుంది. గ్లోబల్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ షట్లర్‌గా ఆమె గుర్తింపు పొందడం గమనార్హం. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా నెహ్వాల్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో రెండు బంగారు పతకాలను సాధించింది. ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడల్లో ఆమె కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది.