
IPL 2025 : 'సలైవా' గేమ్ ఛేంజరా? నేనైతే వాడను: మిచెల్ స్టార్క్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
మ్యాచ్ చివరికి సూపర్ ఓవర్ వరకు వెళ్లగా, అందులో ఢిల్లీ తళుక్కుమంది.
ఈ విజయానికి ప్రధాన కారణం ఆ జట్టులోని స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అని చెప్పొచ్చు.
రాజస్థాన్ రాయల్స్ 189 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి ఓవర్‌కు 9 పరుగులు కావాల్సి ఉండగా, బంతులు విసిరేందుకు స్టార్క్ వచ్చాడు.
అత్యంత ఒత్తిడిలోనూ అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు.
ఆ ఓవర్‌లో కేవలం 8 పరుగులకే పరిమితం చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితంగా పోరు సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
వివరాలు
సెలైవా వినియోగంపై నిషేధం
సూపర్ ఓవర్‌లోనూ మిచెల్ స్టార్క్ తన సత్తా చాటాడు. కేవలం 11 పరుగులే ఇచ్చి రాజస్థాన్‌ను కట్టడి చేశాడు.
అనంతరం ఢిల్లీ జట్టు ఆ లక్ష్యాన్ని నాలుగు బంతుల్లోనే ఛేదించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తన విజయంలో ఉమ్మి లేదా లాలాజలానికి (సెలైవా) ఎలాంటి పాత్ర లేదని స్టార్క్ స్పష్టం చేశాడు.
తాను సెలైవాను వాడలేదని, బంతిపై చెమటను ఎక్కువగా ఉపయోగించేందుకు మాత్రమే ప్రయత్నించానని చెప్పాడు.
ఐపీఎల్‌లో కరోనా కారణంగా గత ఐదేళ్లుగా సెలైవా వినియోగంపై నిషేధం కొనసాగుతోంది. అయితే, ఐపీఎల్ 2025 సీజన్‌తో ఈ నిబంధనను తిరిగి ప్రవేశపెట్టారు.
సెలైవాతో బంతిపై ఏమైనా ప్రభావం ఉంటుందన్న భావన తనకు లేదని స్టార్క్ తేల్చిచెప్పాడు.
వివరాలు
చెమటకు,సెలైవాకుపెద్దగా తేడా లేదు
చెమటకు,సెలైవాకుపెద్దగా తేడా లేదని,ఎర్ర బంతిపై కొంత ప్రభావం ఉండొచ్చేమో కానీ,తెల్ల బంతిపై అలాంటిది ఉండదని వివరించాడు.
ఈ మ్యాచ్‌లో విజయం తనకు అపార ఆనందాన్ని కలిగించిందని చెప్పాడు.తాను పూర్తి ప్రణాళికతోనే మ్యాచ్‌కి దిగానని,వాటిని అమలు చేయగలిగినందుకు సంతోషంగా ఉందన్నాడు.
సూపర్ ఓవర్‌లో ఆడటం కూడా మంచి అనుభవమేనని,ఒక్క నోబాల్ వేసినా వెంటనే సర్దుకుంటూ మ్యాచ్‌ను తిరిగి పట్టుకున్నామని చెప్పాడు.
ఆ ఓవర్‌లో రనౌట్ రూపంలో రెండు వికెట్లు దక్కాయని,తర్వాత బ్యాటర్‌లు పని తక్కువగా చేసి విజయం సాధించారన్నారు.
జట్టుకు అక్షర్ పటేల్ చాలా బాగా నాయకత్వం వహిస్తున్నాడని కొనియాడాడు.
బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు.
అంతేకాకుండా, స్టబ్స్, కేఎల్ రాహుల్‌లకు ఉన్న అనుభవం కూడా జట్టుకు మేలు చేస్తోందన్నాడు.